బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిరసన
                    Hyderabad | RTC ఛార్జీల పెంపును నిరసిస్తూ, BRS ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీకి సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం మోపే ఆలోచనలు మానుకోవాలని, వెంటనే బస్సు చార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
బస్సులో ప్రయాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా పలువురు ప్రయాణికులు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ పెంపుదల రోజువారీ ప్రయాణికులపై నెలకు రూ. 400-500 అదనపు భారం పడుతోందని అన్నారు. ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, సేవలను మెరుగుపరచడంలో విఫలమైందని చాలా మంది ఆరోపించారు.
అసెంబ్లీ సమీపంలో దిగిన తర్వాత, BRS శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్...                
                
             
								



