Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు.
సీఎం సూచించిన కీలక అంశాలు:
అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంటనే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ నగర ద...