Sarkar Live

Hyderabad

దానం,కడియం లకు ఊరట…
Hyderabad

దానం,కడియం లకు ఊరట…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పును వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన నిర్ణయాన్నే పునరావృతం చేస్తూ, వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత వేటు పడలేదు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయన సభ్యత్వం సురక్షితమని స్పీకర్ తేల్చిచెప్పారు.గతంలో ఇతర ఎమ్మెల్యేల పిటిషన్లను ఏ ప్రాతిపదికన కొట్టివేశారో, అదే తరహాలో వీరిపై దాఖలైన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలకు షాక్? చట్టసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట...
నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట
Crime, Hyderabad

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట

లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐల అరెస్ట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు ఒక కేసు విషయంలో నిందితుడికి సెక్షన్ 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రతిఫలంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్ఐలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు....
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
Hyderabad

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి
Hyderabad

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
error: Content is protected !!