Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజమాన్యాలు.. ఆరోగ్యశ్రీ సేవలు బంద్
Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవలు బంద్ అయ్యాయి. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రాకపోవడంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల (Private hospitals) యాజమాన్యాలు చేతులు ఎత్తేశాయి. తమకు బకాయి ఉన్నవేలకోట్ల నిధులను విడుదల చేయమని అనేక సార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ అసోసియేషన్ (TANHA) ప్రకటించింది.
విఫలమైన చర్చలు.. నిలిచిపోయిన సేవలు
తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొనసాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్రతినిధులు ఓ...




