Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్, నాటుసారా, ఎన్‌డీపీఎల్ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శనివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్, ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. అక్రమ, కల్తీ మద్యం, కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్, చర్లపల్లి ప్యాక్టరీలో డ్రగ్స్ ముడి సరుకు తయారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగతి, శిక్షల రేషియో, పాత నేరస్తుల, నిందితులపై నిఘా, తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్నవారిని వెంటనే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన...




