హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II
Hyd Metro Phase II : హైదరాబాద్ మెట్రో ఫేజ్-II (బి) కారిడార్‌లైన JBS - మేడ్చల్, JBS - షామీర్‌పేట్, విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPRలు) పూర్తిగా సిద్ధమయయ్యాయి. కొత్త డీపీఆర్ లు మే 8న హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఆమోదించిందని మెట్రో రైలు అధికారులు తాజాగా ధృవీకరించారు. ప్రతిపాదిత JBS-షామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 1.65 కి.మీ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా ఉంది.
డీపీఆర్‌లు ప్రస్తుతం ప్రభుత్వ సమీక్షలో ఉన్నాయని HAML మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందే వరకు కొన్ని వివరాలు గోప్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ల (Hyd Metro Phase II DPRs) ను సమగ్ర...