నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ – New Ration Cards
New Ration Cards Distribution | ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈరోజు (14వ తేదీ) సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) పేర్కొన్నారు.
కాగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార...