KCR | ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ బహిరంగ సభ కేసీఆర్ కీలక ప్రకటన
బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం
KCR | బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం (BRS State Executive Meeting ) లో మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. 100శాతం మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతాన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు లని కేసీఆర్ ఈసందర్భంగా వెల్లడించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలకు ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమి...




