KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
                    KTR | హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అండగా నిలిచిన భారతరాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం విద్యార్థి నేతలను అరెస్టు చేసి ఇప్పటికీ వారి ఆచూకీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా?, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాల గురించి నిలదీస్తే గొంతు నొక్కుతారా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మా బీఆర్ఎస్‌వి నాయకులు ‘గురుకుల బాట’ చే...                
                
             
								



