Chandrababu Naidu | ధనిక దేశంగా భారత్.. 2047 కల్లా సాధ్యం
Chandrababu Naidu On Visksit Bharat | భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడమే దీనికి కారణమని కొనియాడారు. దీంతో 2047 నాటికి అభివృద్ధి చెంది ధనిక దేశంగా భారత్ ఖ్యాతిని సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ భేష్
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేసిన చంద్రబాబు అక్కడి మీడియాతో మాట్లాడటంతోపాటు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు. 2025 కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను ఆయన అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEs), గ్రామీణ అభివృద్ధి, పెట్టుబడి విధానాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపు పరిమ...



