Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు పథకాల పైసలు పడేది నేడే..
Raithu Bharosa Scheme | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా(Raithu Bharosa Scheme) , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ రోజు (జనవరి 27) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నాలుగు పథకాల ద్వారా రైతులు, కూలీలు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో (Bank Accounts) నేరుగా జమ చేస్తున్నారు.
Raithu Bharosa : అకౌంట్లో డబ్బులు జమ కాకపోతే..
రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, సంబంధిత అధికారులను పథకాల అమలుకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తమ అకౌంట్లలో నగదు జమ కాకపోతే స్థానిక అధికారులను సంప్రదించాలని లబ్ధి...




