Sarkar Live

State

Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు
State

Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు

Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) త‌న‌ జోరును పెంచింది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌ను ముమ్మ‌రం చేసింది. తాజాగా హైద‌రాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని  అనురాగ్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ ప్రాప‌ర్టీలో ఉన్న‌ దుకాణ స‌ముదాయాన్ని నేల‌మ‌ట్టం చేసింది. దీంతో నిర్వాసితులు, అధికారుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.  అల్కాపురి కాలనీ (Alkapuri Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ షెట్టర్స్‌ (Commercial shutters)ను అధికారులు తొలగించారు అనుమ‌తులు ఉన్నాయి : నిర్వాసితులు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలను తొలగించేందుకు హైడ్రా ఉపక్ర‌మించింది. దీంతో షాపు య‌జ‌మానులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మ వ‌ద్ద అన్ని ర‌కాల అనున‌మతులు ఉన్నాయ‌ని...
Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..
State

Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..

Bhu Bharati : భూముల రికార్డుల‌ను ప‌టిష్ట ప‌ర్చ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ స‌ర్కారు న‌డుం బిగించింది. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రీ‌కారం చుట్టింది. ధ‌ర‌ణి స్థానంలో ‘భూ భారతి’ని రూపొందించి. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త ఆర్వోఆర్ (రివెన్యూ రికార్డులు) బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌కటించారు. Bhu Bharati Bill కొత్త చట్టం లక్ష్యాలు భూభార‌తి అనే కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా పార్ట్-బీ కింద 18 లక్షల ఎకరాల భూముల సమస్యలకు పరిష్కారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ కంఠం భూములు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. చట్టంలోని తప్పుల పట్ల అప్పీల్‌కు కూడా అవ‌కాశం క‌ల్పించింది. ధరణిలోని 33 మాడ్యూల్స్‌తో పరిష్కరించలేని సమస్యలను భూ భారతిలో ఆరు మాడ్యూల్స్‌తో సులభతరం చేయ‌నుంది...
Cancer Vaccine |  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. క్యాన్స‌ర్ రోగులకు భారీ ఊరట! ర‌ష్యా కొత్త వ్యాక్సిన్ వస్తోంది..
State

Cancer Vaccine | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. క్యాన్స‌ర్ రోగులకు భారీ ఊరట! ర‌ష్యా కొత్త వ్యాక్సిన్ వస్తోంది..

Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి త్వరలో రానుంది. ర‌ష్యా దీన్ని రూపొందించింది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను లాంచ్ చేయ‌నుంది. ఈ మేర‌క‌కు ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. తమ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంద‌ని, ఇది తుది ద‌శకు చేరుకుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాతే అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టి. ఇది వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేయ‌డం త‌ప్ప దీని బారి నుంచి బ‌య‌ట ప‌డానికి క‌చ్చిత‌మైన చికిత్స లేదు. అయితే.. ఈ విష‌యంలో ర‌ష్యా పురోగ‌తిని సాధించింది. క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఆ వ్యాధిగ్ర‌స్థుల‌కు అందుబాటులోకి తెస్తోంది. ఈ వ్యాక్సిన్ రోగులకు చికిత్స అందించడానికే ఉపయోగపడుతుందన...
BRS Protest | ఖాకీ చొక్కాలు ధ‌రించిన గులాబీ ద‌ళం.. ఆటో వాలాల‌కు సంఘీభావం
State

BRS Protest | ఖాకీ చొక్కాలు ధ‌రించిన గులాబీ ద‌ళం.. ఆటో వాలాల‌కు సంఘీభావం

BRS Protest : ఆటో డ్రైవర్ల‌కు గులాబీ ద‌ళం మ‌ద్ద‌తుగా నిలిచింది. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా గ‌ళాన్ని మ‌రింత ప‌దును పెట్టింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల‌న‌లో ఆటో డ్రైవ‌ర్ల‌ (Auto Drivers) కు అన్యాయం జ‌రుగుతోందంటూ విమ‌ర్శిస్తూ వ‌స్తున్న బీఆర్ఎస్.. త‌న నిర‌స‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసింది. ఆటో డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌ల‌పై బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) నేతృత్వంలో హైద‌రాబాద్ రోడ్ల‌పై బుధ‌వారం భారీ ప్ర‌ద‌ర్శ‌నను నిర్వ‌హించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు ఇందులో పాల్గొన్నారు. ఆటో డ్రైవ‌ర్లు ధ‌రించే ఖాకీ చొక్కాలు వేసుకొని ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మ‌రించింద‌న...
Liquor Revenue | తెలంగాణకు మ‌ద్యం కిక్కు..  లిక్కర్ అమ్మకాలతో రూ.20వేల కోట్ల రాబడి
State

Liquor Revenue | తెలంగాణకు మ‌ద్యం కిక్కు.. లిక్కర్ అమ్మకాలతో రూ.20వేల కోట్ల రాబడి

Liquor Revenue | తెలంగాణ రాష్ట్రంలో లిక్క‌ర్ విక్రయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లోనే రూ.20,903.13 కోట్ల ఆదాయం వొచ్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ స‌వంత్స‌రం ఏప్రిల్‌ నెల నుంచి నవంబరు వరకు ఎక్సైజ్‌ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపంలో రూ.10,285.58 కోట్లు, అలాగే పన్నుల‌ రూపంలో రూ.10,607.55 కోట్లు వ‌చ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ శాస‌న స‌భ‌లో వెల్ల‌డించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌తిక్ష‌ బిఆర్ఎస్ స‌భ్యులు అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ సమాధానమిచ్చింది. రాష్ట్రంలో అక్రమ లిక్క‌ర్ అమ్మ‌కాల‌ను నియంత్రిస్తున్నామ‌ని, ఎప్పటికప్పుడు అనధికారిక మ‌ద్యం విక్ర‌యిస్తున్న‌వారిపై కేసులు పెడుతున్నామ‌ని చెప్పారు. TG Liquor Cases : ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేసి 74,425 లీటర్ల లిక్క‌ర్, 353 వాహనాలను జప్తు చే...
error: Content is protected !!