Sarkar Live

State

NHAI | టోల్ వసూలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఎంత సంపాదించాయి?
State

NHAI | టోల్ వసూలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఎంత సంపాదించాయి?

NHAI | న్యూఢిల్లీ : 2000లో ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి హైవేల‌పై ప్రయాణికుల నుంచి దాదాపు రూ.2.1 లక్షల కోట్లను యూజర్ ఫీజుగా వ‌సూలయ్యాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కేంద్రం భారీ మొత్తంలో నిధుల‌ను ఖ‌ర్చుచేస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు అంచనా. కాగా గత 24 ఏళ్లలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్మించిన ర‌హ‌దారుల కోసం ప్రైవేట్ హైవే నిర్మాణ కంపెనీలు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల టోల్ వసూలు చేశాయని మంత్రిత్వ శాఖ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ స్ట్రెచ్‌లలో, NH-48 ప‌రిధిలోని గుర్గావ్-జైపూర్ కారిడార్ యూజర్ ఛార్జీల రూపంలో దాదాపు రూ. 8,528 కోట్లు వసూలు చేసింది. టోల్ సేకరణలో UP నంబర్ 1 ప్రైవేట్ కంపెనీలు PPP కింద ర‌హ‌దారుల నిర్మాణాన...
Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం
State

Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్: హైద‌రాబాద్‌లో అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగింది. ఈమేర‌కు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్‌ మునిసిపల్‌ కమిషనర్‌, బాచుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న నాలుగు గదులను కూడా నేల‌మ‌ట్టం చేశారు. కార్య‌క్ర‌మంలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నరేందర్‌రెడ్డి, భానుచందర్‌, ప్రశాంతి పాల్గొన్నారు....
Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
State

Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

Dharani Portal | రాష్ట్ర వ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి ధరణి అప్లికేషన్లు భారీగా పెండింగులో ఉన్నాయి. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారాలను రాష్ట్రభుత్వం వికేంద్రీకరించింది. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టింది.ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గురువారం  సర్క్యులర్ జారీ చేశారు. గత మూడు రోజుల క్రితమే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నెలల తరబడి దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు.. అయితే ఈ సారైనా సీసీఎల్ఏ జారీ చేసిన ఆదేశాలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్డీవో స్థాయి: టీఎం 4. అసైన్డ్ భూమ...
Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!
State

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) వెల్ల‌డించింది. నవంబర్‌ 30 ‌నుంచి డిసెంబర్‌ 2‌వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈమేర‌కు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ పేర్కొంది. చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వొచ్చే  12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని అంచనా వేసింది. ఉదయంలోపు తుపానుగా మారే చాన్స్‌ ఉందని ఐఎండీ వివరించింది.శనివారం (నవంబర్‌ 30‌వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్‌, ‌మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్‌ ‌లో పేర్కొంది. ఈ ప్రభావంతో 3 రోజులు ఏపీలోని దక్షిణకోస్తాలో ...
Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ  మార్పులు
State

Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులు

Tenth Class Marks System : రాష్ట్రంలోని పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇక నుంచి 100 మార్కులకు తుది పరీక్షలను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది....
error: Content is protected !!