Premium coffee | ప్రీమయం కాఫీ.. పెరుగుతున్న క్రేజ్.. బిజినెస్
Premium coffee : కాఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లాది మందికి ఇది ఇష్టమైన పానీయం. కాలంతోపాటు మనుషుల్లో ఆసక్తులు మారుతున్నా కాఫీపై ఉన్న ఇంట్రెస్టు చెక్కు చెదరలేదు. పైగా రోజురోజుకూ పెరుగుతోంది కూడా. ఇదే క్రమంలో ప్రీమియం కాఫీ (Premium coffee)కి బహు ఆదరణ పొందుతోంది. తద్వారా దీని వ్యాపారం వేగం పుంజుకుంది. భవిష్యత్తులో ఇంకా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. భారతదేశంలో అవుట్ ఆఫ్ హోం కాఫీ మార్కెట్ (out-of-home coffee market ) 2028 నాటికి 2.6 నుంచి 3.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఈ రోజు వెలువడిన తాజా నివేదిక చెబుతోంది. ఈ వ్యాపారం 15-20 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.
Premium coffee Business : వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారం
కాఫీ మార్కెట్ 2023లో 46 శాతం వాటాతో ఉన్న ప్రీమియం కాఫీ (రూ. 200 కంటే పైగా ధర ఉన్న కాఫీ) వ్యాపార రంగ...




