Sarkar Live

State

Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!
State, Hyderabad

Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!

8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. Jubilee Hills Bypoll Results Live | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే ఆధిక్యంలోకొనసాగుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 23వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు లభించాయి. 8వ రౌండ్‌ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం కైవ‌సం చేసుకుంది....
Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌
State, Hyderabad

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం అయితే ఎగ్జిట్‌ ...
Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు
State

Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు

ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్‌ వరంగల్​/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్​ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సార...
Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ
State, Karimnagar

Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ

ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆల‌య ప్ర‌ధాన ద్వారాలు మూసివేయ‌డంతో అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో, అధికారులు దర్శనాలను నిలిపివేసి ఆలయ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక మంది భక్తులు ప్రధాన ఆల‌యానికి సంబంధించిన‌ మూసివేసిన ద్వారం వద్ద పెద్ద సంఖ్య‌లు భ‌క్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ప్రధాన ద్వారం వద్ద ఆలయ పశ్చిమ భాగంలో ఉన్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్ట‌డం, దీపాలు వెలిగించడం, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. కార్తీక మాసం అత్యంత పవిత్...
Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
Hyderabad, State

Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు బ‌లాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేకాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్‌ సర్వేకాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది. స్మార్ట్‌ పోల్స్‌ సర్వేకాంగ్రెస్‌ 48.2%, బీఆర్‌ఎస్‌ 42.1%, బీజేపీ 7.6%, ...
error: Content is protected !!