పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ముఖ్యమైన వివరాలు:
పరీక్షా కేంద్రాలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 కేంద్రాలు (హన్మకొండ-64, వరంగల్-47, జనగామ-39).
సమయం: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
అమలు కాలం: ఏప్రిల్ 16, 2026 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
విధించిన ఆంక్షలు:
. పరీక్ష కేంద్రాల సమీపంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉంది.
. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు అనుమతి లేదు.
.పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను ప్ర...




