Sarkar Live

State

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌
State, AndhraPradesh

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న‌ట్లు భార‌త వాతావర‌ణ శాఖ వెల్ల‌డించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది. ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ....
KTR | తెలంగాణ‌లో బుల్డోజ‌ర్ పాల‌న రాహుల్ స‌మాధానం చెప్పాలి..
Hyderabad

KTR | తెలంగాణ‌లో బుల్డోజ‌ర్ పాల‌న రాహుల్ స‌మాధానం చెప్పాలి..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ప్రజలు బీఆర్‌ఎస్ ప్రగతిని గుర్తు చేసుకోవాలి – KTR Hyderabad | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసపూరిత పాలనను తూకం వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. శనివారం షేక్‌పేట్ డివిజన్‌లోని రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన నడుపుతోందని విమర్శించారు. “తెలంగాణలో మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్‌పై అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ క‌లిసే ప‌నిచేస్తున్నాయి.. కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, బీజేపీ నే...
ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి
Crime, Adilabad

ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి

ACB Raid in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) చేసి ఓ అవినీతి తిమింగ‌ళాన్ని ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్నారు.. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) క‌థ‌నం ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గతేడాది నవంబరులో సస్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. అయితే సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తివేయడం కోసం ఏకంగా రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలోని ...
Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష
State

KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష

కాంగ్రెస్‌ రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చింది: మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో అధికార‌ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌గా పేరుగాంచిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞత, తెలివితేటలకు ఈ ఎన్నిక కఠిన పరీక్షగా నిలుస్తుందని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని అన్నారు. “కాంగ్రెస్ దుష్టపాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంద...
error: Content is protected !!