Sarkar Live

State

తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line
Hyderabad, State

తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line

Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సా...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
Festive season : పండుగ సీజన్‌కు సిద్ధ‌మ‌వుతున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ
State, Hyderabad

Festive season : పండుగ సీజన్‌కు సిద్ధ‌మ‌వుతున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ

Hyderabad : సెప్టెంబర్ 19, అక్టోబర్ 28 మధ్య దసరా, దీపావళి, ఛత్ పూజ‌ పండుగ (Festive season )లను పుర‌స్క‌రించుకొని ప్రయాణీకుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణీకుల భద్రత, సౌక‌ర్య‌వంత‌మైన ర‌వాణా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్ర‌త్యేక‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం, బుధవారం ఎస్‌సిఆర్ అధికారులు, ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, టిజిఎస్‌ఆర్‌టిసిలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ , చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ, స్నాచింగ్, జేబు దొంగతనం, నిషేధిత ప్రాంతాలలోకి అనధికార ప్రవేశాలను అరికట్టడం వంటి ముఖ్యమైన సమస్యలపై సమీక్షించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, సర్క్యులేటింగ్ జోన్లలో రద్దీ పెరగడం, రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, తొక్కిసలాట లాంటి పరిస్థితులు తలెత్త‌కుండా ముంద‌స్తు ...
Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..
State, Nalgonda

Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..

Siddipet : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage )పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) విమ‌ర్శించారు. వరదలు, యూరియా సమస్యలు పక్కన పెట్టి బురద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్ధంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. Urea Shortage : కాంగ్రెస్ చేత‌గాని పాల‌నతోనే.. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా క...
Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌
State, Hyderabad

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం బుధ‌వారం జ‌రిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండ‌దండ‌లు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువు...
error: Content is protected !!