Sarkar Live

State

Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్
State, warangal

Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్

Telangana : సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుశ్మిత (Konda Sushmitha) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండ‌ని రేవంత్ రెడ్డి కాళ్లు ప‌ట్టుకొని మొక్కాలా..? అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు. దిల్లీలో ఖర్గేతో స‌మావేశంలో మా అమ్మను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) తిడితే ఆరోజు మా అమ్మ ఎంతో ఏడ్చింద‌ని సుష్మిత తెలిపారు. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సోద‌రులు మొత్తం భూములను ఆక్ర‌మిస్తున్నారు. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం దేవాదాయ‌శాఖ భూమిని అడిగారు.. దీనిప ప్ర‌శ్నిస్తే దానికి బ‌దులుగా పక్కన ప్రైవేట్ భూమి ఇస్తామని అన్నారు. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా...
HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!
State

HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!

Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీత‌క్క ప్ర‌కారం.. హ్యామ్‌ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్‌ నోటిఫికేషన్ శుక్ర‌వారం విడుదల చేయ‌నున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీత‌క్క‌ వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిప...
Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Crime, State

Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ ‌బాలానగర్‌ ‌(Balanagar) ప్రాంతంలో విషాదక‌ర‌ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు. ఆమె భర్త అనిల్‌ ‌కుమార్‌ ‌తో కలిసి పద్మారావు నగర్‌ ‌ఫేజ్‌-1, ‌బాలానగర్‌ ‌లో నివాసముంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్‌ ‌కార్తికేయ, లాస్యతవల్లి ఉన్నారు. అయితే స్థానికుల క‌థ‌నం మేర‌కు కొంతకాలంగా భర్తతో విభేదాలు, వ్యక్తిగత సమస్యల కార‌ణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, క్ష‌ణికావేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ‌రో ఘ‌ట‌న‌లోకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం కల్పన(...
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways
State, Hyderabad

హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways

Telangana Highways | రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ (HAM )విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమితిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు ఖ‌ర్చును పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవ‌త్స‌రం జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారులను నిర్మించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర ర‌హ‌దారులు నిర్మించ‌నున్నారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కడం విశేషం. Telangana Highways : రాష్ట్రానికి లభించిన ప్రధాన ప్రాజెక్టుల...
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election
State, Hyderabad

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election

Jubilee Hills By Election | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర‌ ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించనున్న‌ట్లు ఎన్నికల సంఘం వెల్ల‌డించింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల 11న పోలింగ్‌, 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరించ‌నున్నారు. కార్యాలయంలో నేరుగా లేదా ఆన్‌లైన్‌ విధానంలో దాఖలు చేసే వీలు క‌ల్పించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు వెల్లడించారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలన...
error: Content is protected !!