Sarkar Live

State

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Karimnagar

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్‌ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...
Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad, State

Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధ‌వారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు. సీఎం సూచించిన కీలక అంశాలు: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంట‌నే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భవిష్యత్‌ నగర ద...
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
State, Districts

Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచ‌రిచ‌డం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోంద‌ని తెలియ‌డంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతు న్నారు. తాజాగా బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్ద‌పులి ద‌ర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంద‌రు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతున‌నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
error: Content is protected !!