Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..
Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతుండడంతో కాలనీలు, రహదారులు కుంటలు, వాగులను తలపిస్తున్నాయి. బట్టలబజార్, పాతబీటుబజార్ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. హంటర్‌రోడ్, ఎన్టీఆర్‌నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్ శాకరాశికుంట, ఎన్‌ఎన్‌నగర్, ఎస్ఆర్ నగర్, గరీబ్నగర్ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి.. ఇండ్లలోకి నీరు చేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్ నీటిమునిగింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇక హన్మకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేడ్కర్ భవన్ వంటి పలు ప్రాంతాల్లో రహదారులు...




