Vemulawada | వేములవాడలో ముమ్మరంగా కూల్చివేతలు
Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో (Vemulawada) బుల్డోజర్లు (Bulldozers) కూల్చివేతలు ప్రారంభించాయి. సోమవారం ఉదయం నుంచే అధికారులు ప్రదాన రోడ్ల వెంట భవనాలను కూల్చివేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada Road expansion ) పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్‌లను నేలమట్టం చేస్తున్నారు. మొత్తం 10 జేసీబీలతో పది బృందాలు నిర్విరామంగా కూల్చివేతలు చేపడుతున్నాయి. అధికారులను ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను యజమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు
Vemulawada : రోడ్ల విస్తరణకు రూ.47కోట్లు..
...




