Sarkar Live

State

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం
State, Hyderabad

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ ...
ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ
State, Crime

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స‌ద‌రు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్య‌లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివ‌ర‌కు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద...
ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు – India-Pakistan War LIVE Updates
State

ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు – India-Pakistan War LIVE Updates

India-Pakistan War LIVE Updates : ఆపరేషన్ సిందూర్ తో తీవ్ర పరాభవానికి గురైన పాకిస్తాన్.. పరువు నిలుపుకునేందుకు జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారత సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, క్షిపణులతోపాటు పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే మరోసారి భారత ఆర్మీ తనదైన శైలిలో పాక్ కు గట్టిగుణపాటం చెప్పింది. మన వైమానిక రక్షణ వ్యవస్థలు రాబోయే ముప్పులను ముందే పసిగట్టి మిసైళ్లను విజయవంతంగా తిప్పికొట్టాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మే 7–8 రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో పాటు 'కాల్పు విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చాం ' అని భారత సైన్యం శుక్రవారం ధృవీకరించింది. #ఆపరేషన్ సిందూర్ లో భారత సాయుధ దళాలు వేగంగా ప్రతిస్పందించాయి. పాకిస్తాన్ కు చెందిన హచ్ క్యూ ఇంటిగ్రేటె...
విషాదం..  కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War
State

విషాదం.. కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War

India Pakistan War : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీనాయక్ (Jawan Murali Nayak) స్వస్థలం సత్యసాయి జిల్లా, జిల్లా గోరంట్ల మండలం జిల్లా కల్లి తండా. మురళీనాయక్ యుద్దంలో మరణించినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. శనివారం మురళీ నాయక్ పార్ధీవ దేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. వీర జవాన్ మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు. సీఎం చంద్రబాబు నివాళి దేశ రక్షణలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా నివాళులర్పించారు. పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ని...
India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్
State

India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్

India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడుల‌తో భార‌త్ అల‌ర్ట్ అయింది. వెంట‌నే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల‌ లోపలే ఉండి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత సమయంలో, గురువారం ఉదయం, పాకిస్తాన్ నుంచి వస్తున్న అనేక రాకెట్లను భారత్ ధ్వంసం చేసింది . పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. కానీ భారత సైన్యం అన్నింటిని భగ్నం చేసింది. మే 7-8 రాత్రి డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఖురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, ...
error: Content is protected !!