Sarkar Live

State

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
Hyderabad

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల‌ విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...
Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం
State, Hyderabad

Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం

జీటో కనెక్ట్‌ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధ‌ర్ బాబు Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌ (Hyderabad itex), హెచ్‌ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్‌ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగ...
Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
State, Hyderabad

Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్య‌మైన‌ బ్యారేజీలను పున‌రుద్ధ‌రించాల‌ని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీల‌క‌మైన‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల‌ నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్‌ టెండర్లను ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువ‌నుంది.కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చే...
రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
error: Content is protected !!