Sarkar Live

State

Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల
State

Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల

Hyderabad MLC poll : హైదరాబాద్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Hyderabad Local Bodies MLC elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. ఈ ఎన్నికలు (Hyderabad MLC poll ) రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉండటమే కాకుండా ప్రధాన పార్టీల మధ్య పోటీని పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. Hyderabad MLC poll : 28న నోటిఫికేష‌న్‌ ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి 28న అధికారిక నోటిఫికేషన్ (notification) విడుదలతో ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల (nominations) స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని ఏప్రిల్ 9గా నిర్ణయించారు. ఓటింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. రెండు రోజుల తర్వాత ఏప్ర...
Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌
State

Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్‌పై ఈ రోజు కూడా ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య చర్చ ప్రారంభ‌మైంది. మునిసిప‌ల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపుల‌పై చర్చ కొన‌సాగింది. ముఖ్యంగా మునిసిపాలిటీల‌ స‌వ‌ర‌ణ బిల్లు (Municipalities Amendment Bill) లు, పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుల (Panchayat Raj Amendment Bill) ను ఈ స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) గట్టిగా నినాదాలు చేస్తూ పంట రుణ మాఫీపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. వార్షిక బడ్జెట్‌పై చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులు చేస్తుండ‌గానే నిర‌స‌న‌తో హోరెత్తించారు. రుణ మాఫీ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకోవాల‌ని డి...
ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools
State

ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools

AI Primary schools in Telangana | విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్ల‌వాత్మ‌క‌ మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతోంది. ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా కొత్త‌గా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేయబోతోంది. ముఖ్యంగా ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల (Primary schools) విద్యార్థుల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధ‌స్సు (Artificial intelligence (AI)ను చేర్చాలని విద్యా శాఖ (Education department) నిర్ణయించుకుంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం (academic year) నుంచి ఇది అమల్లోకి రానుంది. AI in Primary schools : ఏయే క్లాసులు అంటే..1 రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తున్న కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు (primary students) కంప్యూటర్‌తో పాటు AI, డిజిటల్ రంగంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకోనున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆధునిక టెక్నాలజీపై...
New Traffic Rule | ఐదుసార్లే చాన్స్‌.. ఆపై లైసెన్స్ ర‌ద్దు : ట్రాఫిక్ కొత్త రూల్
State

New Traffic Rule | ఐదుసార్లే చాన్స్‌.. ఆపై లైసెన్స్ ర‌ద్దు : ట్రాఫిక్ కొత్త రూల్

New Traffic Rule : తెలంగాణ (Telangana) రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ రూల్స్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences)ను శాశ్వ‌తంగా ర‌ద్దు (permanently revoke driving licence) చేయ‌నుంది. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (elangana transport minister Ponnam Prabhakar) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి భ‌ద్ర‌త‌ను పెంచే దిశ‌గా ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. వాహ‌నాల రిస్ట్రేష‌న్లు కూడా ర‌ద్దు లైసెన్స్ రద్దు చేయడం అనేది ఇప్పటి వరకు తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు ఒకే వ్యక్తి ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అతనికి తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences) పొంద‌డం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా నిబంధనలు...
Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెట‌ర్ల‌పై ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు షురూ.. టీటీడీ అప్‌డేట్స్‌
State

Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెట‌ర్ల‌పై ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు షురూ.. టీటీడీ అప్‌డేట్స్‌

Tirumala Tirupati : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖల (recommendation letters) ఆధారంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల (devotees)కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. రేప‌టి (మార్చి 24) నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N Chandrababu Naidu) ఆదేశాల మేర‌కు ఈ ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని టీటీడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. Tirumala Tirupati : విశేష దర్శన ఏర్పాట్లు కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం, ఉగాది పండుగ కారణంగా మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల (darshans)ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 24, 29 తేదీల్లో వీఐపీ దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవ‌ని వెల్ల‌డించారు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల మరోవైపు టీటీడీ అధికా...
error: Content is protected !!