Sarkar Live

State

Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం
State

Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం

Modi Visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమరావతి (Amaravati)లో పర్యటించనున్నారు. రాజధాని పనుల (capital city's construction works) పునఃప్రారంభానికి మే 2న ఆయన రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ (Minister P. Narayana) ఈ రోజు అమరావతిలో పర్యటించారు. మోదీ టూర్‌కు సంబంధించిన‌ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ్ తదితరుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. Modi Visit : రాజధాని పనులకు ఊతం రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న ప్ర‌తిష్టాత్మ‌కం (prestigious)గా మారింది. ఆయ‌న రాక‌తో రాజధాని నిర్మాణానికి (capital city's cons...
Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!
State, Hyderabad

Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!

Anganwadi Centers | అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పిల్లలకు మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశామని వివరించారు. వారి నివేదిక ఆధారంగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పల్లీ పట్టీలు, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్వాడీ (Anganwadi Vehicle...
Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Hyderabad, State

Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయ‌న నివాసంలో సీఎం సోమ‌వారం క‌లిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. శాంతి చ‌ర్చ‌ల‌పై స‌మాలోచ‌న‌ కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని పీస్ టాక్స్ (Peace Talks Committee) క‌మిటీ స‌భ్యులు సీఎం రేవంత్‌ను కోరారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) నేపథ్యంలో తక్షణ సీజ్‌ఫైర్ ప్రకటించాలని కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్...
BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు
warangal

BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు

KCR | ప‌దేండ్ల పాటు ద‌గ‌ద‌గ‌లాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామ‌ని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్‌ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ నాయక...
Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..
State

Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..

Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన‌గా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత క‌నిపించింది (Leopard Sighting). దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ (TTD Security) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై ఫారెస్టు (Forest Department) అధికారులకు స‌మాచారమిచ్చారు. ఊర‌ట క‌లిగిన వెంట‌నే మ‌ళ్లీ… కొన్ని వారాలుగా తిరుమల (Tirumala Hills) పరిసర ప్రాంతాల్లో చిరుతల‌ (Leopards) కదలికలు తరచుగా నమోదవుతున్నాయి. సుమారు రెండు వారాల క్రితం కూడా ఒక చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు తీవ్రంగా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు భ‌ద్ర‌త ప‌ర‌మైన అనేక చర్యలు చేప‌డుతున్నారు. చిరుతను పట్టు...
error: Content is protected !!