Bhu Bharathi Portal ప్రజల సూచనలతో అవసరమైతే భూ భారతిలో మార్పులు
Bhu Bharathi Portal : రాష్ట్రంలో భూ భారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti srinivas reddy) ప్రకటించారు. ఈ చట్టాన్ని భూ యజమానులకు మరింత చేరువ చేస్తామన్నారు. ప్రజల మీద ఈ చట్టాన్నిబలవంతంగా రుద్దబోమని వారి సూచనల మేరకు ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దుతామని అందుకే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Bhu Bharathi Portal : జూన్ 2 నాటికి..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి...




