Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ
Telangana Assembly | హైదరాబాద్ : రాష్ట్ర శాసన సభ, మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని, సభలోని రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
కాగా రాష్ట్ర సచివాలయంలో రీడిజైన్ చేసిన...