Tension in OU | అట్టుడికిన ఓయూ.. విద్యార్థుల నిరసనలు, అరెస్టులతో ఉద్రిక్తత
Tension in OU : ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University campus) ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్ (campus)లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించకూడదంటూ యూనివర్శిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఉత్తర్వులకు నిరసనగా వర్సిటీ బంద్(bandh)కు పిలుపునివ్వడంతోపాటు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల(students)ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
Tension in OU : జాక్ నేతల ముందస్తు అరెస్టు
యూనివర్శిటీ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించాయి. ఆర్ట్...



