Former MLA detained | మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకంటే..
Former MLA detained : బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir)ను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI Airport)లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన దుబాయ్ నుంచి భారత్‌కు రాగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్లపాటు పోలీసులకు చిక్కకుండా దుబాయిలో ఉన్న ఆయన తన తల్లి మరణ వార్త విని ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు.
Shakil Aamir ను ఎందుకు అరెస్టు చేశారు?
హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ ఎదుట ఎమ్మెల్యే కుమారుడు రాహీల్ ఆమీర్ అలియాస్ సాహిల్ తన కారు నడిపి పోలీసు బ్యారికేడును ఢీకొట్టాడు. ఇదిఇ 2023 డిసెంబరులో జరగ్గా కలకలం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ ఆమీర్ సహ...




