TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. హాల్ టికెట్లు విడుదలయ్యేది అప్పుడే..
TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణలో టెట్ కు భారీగా డిమాండ్ ఉంది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తంగా 2,48,172 దరఖాస్తులు సమర్పించారు. పేపర్-1కు 71,655 , పేపర్-2కు 1,55,971 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు… డిసెంబర్ 26 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక జనవరి 1, 2025వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతా...