Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?
Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు.
ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...