Sarkar Live

warangal

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు
State, warangal

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు

Sponge Parks in Warangal : త‌ర‌చూ భారీ వర్షాల‌తో మునిగిపోతున్న వరంగల్‌, హన్మకొండ నగరాలు ఇకపై పచ్చని రక్షణ కవచాన్ని పొందబోతున్నాయి. భూగర్భ జలాలను నిల్వ చేస్తూ, వరదలను అడ్డుకునే ‘స్పాంజ్ పార్క్‌’లు నగరపు భవిష్యత్తు పర్యావరణ సమతుల్యతను సాధించ‌నున్నాయి. హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఇటీవ‌ల‌ మోంథా తుఫాను కారణంగా 120 కంటే ఎక్కువ కాలనీలు మునిగిపోయిన నేప‌థ్యంలో , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక సుస్థిర పట్టణ పరిష్కారాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోని వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి “స్పాంజ్ పార్క్‌లు” అనే వినూత్న ప్రాజెక్ట్ ను మొద‌లుపెడుతోంది. స్పాంజ్ పార్క్‌లు వర్షపు నీటిని సహజంగా పీల్చుకుని భూమిలోకి మళ్లించే ప్రదేశాలు. ఇవి నగరంలోని తక్కువ భూమి ఉన్న‌ ప్రాంతాల్లో వరదలను తగ్గించడమే కాకుండా, నీటి నిల్వకు కూడా తోడ్పడతాయి.చ...
Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం
State, warangal

Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం

Warangal : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి భారీ వ‌ర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ప‌లుచోట్ల‌ వరుసగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్‌ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటపాటు పడిన వర్షానికి రహదారులపై వ‌ర‌ద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో అమ్మ‌కానికి తెచ్చిన‌ పత్తి, మొక్కజొన్న తడిసిపోవంతో రైతులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఇటీవల ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు మరోసారి వర్షాల ముంపు భయంతో వణికిపోతున్నాయి. రేపు వ‌ర్షం కురిసే అవ‌కాశం తెలంగాణ వెదర్‌ మాన్‌ అంచనా ప్రకారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్...
Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..
State, warangal

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..

వరంగల్‌ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Warangal : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది.. భారీ వరదల కార‌ణంగా అనేక కాల‌నీలు పూర్తిగా మునిగిపోయి ప్ర‌జ‌లకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్ల‌లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...
Warangal Rains | భారీ వర్షంతో  వరంగల్​ అతలాకుతలం
State, warangal

Warangal Rains | భారీ వర్షంతో వరంగల్​ అతలాకుతలం

జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం మానుకోట, డోర్నకల్​, వరంగల్​ రైల్వే స్టేష‌న్లలో నీటమునిగిన రైలు పట్టాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ త‌ర్వాత‌ వరంగల్‌ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్...
Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
error: Content is protected !!