Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
వివాదాల నడుమ కీలక పరిణామం
16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ
Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయన విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా మురళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అందజేశారు.
Kond...




