Sarkar Live

warangal

Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్
State, Adilabad, warangal

Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్

Heavy rainfall : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ( heavy rainfall ) ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం (Normal life) అస్త‌వ్య‌స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజుల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. Heavy rainfall : జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు, గుంటలు పొంగిపొర్లి లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. పల్లెల్లో రహదారులు నీటమునిగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పంట పొలాల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా కొన్ని ప్రాంతాల్లో వరదలు, ముంపు సమస్యలు తలెత్తుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కొరత కొనసా...
Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో  ఘటన
Viral, warangal

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో ఘటన

Warangal News | వ‌రంగ‌ల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యే ఘ‌ట‌న చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్‌ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు సీసాలో సోంపు ప్యాకెట్‌ బయటపడింది. ఇల్లంద గ్రామంలో ఓ వ్య‌క్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా ప‌రిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ క‌నిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే స‌ద‌రు వ్య‌క్తి వైన్ షాపు య‌జ‌మానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్య‌త‌తో కూడిన బీర్ల‌ను విక్ర‌యించాల‌ని హెచ్చ‌రించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్ల‌ను అమ్మ‌డం ఏమాత్రం స‌రైంది కాద‌ని మండిప‌డ్డాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీక...
Bhupalpally |  విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌
warangal

Bhupalpally | విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Jayashankar Bhupalpally News : స్వాతంత్య్ర వేడుక‌ల (Independence Day celebrations) ఏర్ప‌ట్ల‌లో ఉన్న విద్యార్థులు విద్యాదాఘాతానికి (Electric Shock) గుర‌య్యారు. జాతీయ జెండాను సిద్ధం చేస్తున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ముగ్గురు విద్యార్థుల‌తోపాటు ఒక స్కావెంజ‌ర్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ‌గా వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally district) మ‌హ‌దేవ‌పూర్ (Mahadevpur mandal) మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈ సంఘ‌ట‌న ఇవాళ చోటుచేసుకుంది. జాతీయ జెండాను క‌ట్టే ఇనుప పోల్‌(iron pole)ను పాఠ‌శాల భ‌వ‌నం పైనుంచి దింపుతున్న క్ర‌మంలో విద్యుత్ తీగ‌లు తాకి ముగ్గురు విద్యార్థులతోపాటు స్కావెంజ‌ర్ షాక్‌ (Electric Shock) కు గుర‌య్యారు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన (minor injuries) వీరిని మ‌హాదేవ‌పూర్ సామాజిక ఆస్ప‌త్రి (Hospital)కి త‌ర‌లించారు. విద్యుదా...
Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..
warangal

Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..

Warangal News : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతుండడంతో కాలనీలు, రహదారులు కుంటలు, వాగులను తలపిస్తున్నాయి. బట్టలబజార్‌, పాతబీటుబజార్‌ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. హంటర్‌రోడ్‌, ఎన్టీఆర్‌నగర్‌, రామన్నపేట, శివనగర్‌, కరీమాబాద్‌ శాకరాశికుంట, ఎన్‌ఎన్‌నగర్‌, ఎస్​ఆర్​ నగర్​, గరీబ్​నగర్​ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి.. ఇండ్లలోకి నీరు చేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్‌ నీటిమునిగింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో అండర్​ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  ఇక హన్మకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేడ్కర్ భవన్ వంటి పలు ప్రాంతాల్లో రహదారులు...
Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
error: Content is protected !!