NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం
Mulugu : సీనియర్ జర్నలిస్ట్, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం.
గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...