Bhupalpally | విద్యార్థులకు కరెంట్ షాక్.. ఆస్పత్రిలో చేరిక
                    Jayashankar Bhupalpally News : స్వాతంత్య్ర వేడుకల (Independence Day celebrations) ఏర్పట్లలో ఉన్న విద్యార్థులు విద్యాదాఘాతానికి (Electric Shock) గురయ్యారు. జాతీయ జెండాను సిద్ధం చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు విద్యార్థులతోపాటు ఒక స్కావెంజర్ స్వల్పంగా గాయపడగా వీరిని ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally district) మహదేవపూర్ (Mahadevpur mandal) మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈ సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. 
 జాతీయ జెండాను కట్టే ఇనుప పోల్(iron pole)ను పాఠశాల భవనం పైనుంచి దింపుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకి ముగ్గురు విద్యార్థులతోపాటు స్కావెంజర్ షాక్ (Electric Shock) కు గురయ్యారు. స్వల్పంగా గాయపడిన (minor injuries) వీరిని మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రి (Hospital)కి తరలించారు. విద్యుదా...                
                
             
								



