Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం!
మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు పరుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొందరు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది.
కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...




