Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!
Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది.
ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో ...




