పిల్లలపై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్షలు.. ఏంటవి? – Instagram
Instagram parental controls : ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విరివిగా వాడుతున్నారు. రీల్స్ చూస్తూ, స్టేటస్ పెట్టుతూ, తమ జీవితంలోని ప్రతి సంఘటననూ ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ, ఈ డిజిటల్ ప్రపంచం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు అసభ్య కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తుండటంతో వారి భవిష్యత్తు పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం కొత్త నియమాలను (Instagram safety rules for under 16) ప్రవేశపెట్టింది. ఇకపై ఆ వయసులోపు వారికి ఇన్‌స్టాలో లైవ్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి (Parental permission required for Instagram Live) చేశారు. ఇది ఒక్క లైవ్ స్ట్రీమింగ్ విషయంలో మాత్రమే కాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఫొటోల...