అన్నదాతలతో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka
కూలీలతో ఆత్మీయ పలకరింపు..
Mulugu News | తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమయమైన పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్యవసాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ కవర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయతను చాటుకున్నారు.
ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...