Sarkar Live

Trending

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు
Trending

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు

Indian Railways prepares for Maha Kumbh 2025 |  ప్రయాగ్ రాజ్ లో జరగ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో భ‌క్తుల సౌక‌ర్యార్థం కేంద్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రైల్వేల ప‌రంగా ఇండియ‌న్ రైల్వేస్‌ ఉత్తరప్రదేశ్ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో కలిసి, ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌లను పున‌రుద్ధ‌రిస్తోంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జ‌ర‌గ‌నున్న మహా కుంభ్ 2025 సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం కోసం భారతీయ రైల్వే ప‌లు ప్రాజ‌క్టుల‌ను చేప‌ట్టింది. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోట్లాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చే కుంభ‌మేళాలో రద్దీని నిర్వ‌హించేందుకు ప్రయాగ్‌రాజ్ తోపాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైలు అండర్ బ్రిడ్జిలు (RUBలు), రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించారు. ఈ పరిణామాలు మెగా జాత‌ర‌కు ముందే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్...
Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..
Trending

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ రోగులు ఉన్నారు. ఈ విష‌యం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డియింది. అసంక్రమిత‌ వ్యాధుల (NCD) పోర్టల్‌ ప్రకారం 2024 నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్క‌ల‌ను అందులో ప్ర‌స్తావించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, డ‌యాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయ‌గా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డ‌యాబెటి...
Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో
Trending

Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో

Google Willow : గూగుల్ మరో అపూర్వ సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. గూగుల్ విల్లో అనే త‌ర్వాతి త‌రం క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ను ప్రకటించింది. నేటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయగల పనిని ఇది ఐదు నిమిషాల్లో మాత్ర‌మే పూర్తి చేస్తుంద‌ని పేర్కొంది. అదే పనిని సూపర్ కంప్యూటర్‌కు 10 సెప్టిలియన్ సంవత్సరాలు (10,000,000,000,000,000,000,000,000 సంవత్సరాలు) పడుతుంద‌ని తెలిపింది. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుత ఫలితాలు గూగుల్ క్వాంటం AI టీమ్ అందించిన అద్భుత ఫలితాల్లో క్వాంటం ఎరర్ కారెక్షన్ కీలకం. దీని ద్వారా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ పొరపాట్లు గణనీయంగా తగ్గుతున్నాయని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎమ్మెరిటస్, కోల్‌క‌తాలోని TCG CREST డైరెక్టర్ ప్రొఫెసర్ భాను దాస్ అన్నారు. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంద‌ని తెలిపారు. Google Willowతో విప్లవాత్మక మార్పులు...
TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు
Trending

TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు

TasteAtlas : ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైద‌రాబాదీ బిర్యానీ చోటు ద‌క్కించుకుంది. 31వ ర్యాంకును సంపాదించుకుంది. దీంతో మ‌రో మూడు భార‌తీయ వంట‌కాలకు కూడా ఈ జాబితాలో చోటు ల‌భించింది. TasteAtlas రూపొందించిన ఈ లిస్టులో హైద‌రాబాదీ బిర్యానీ చేర‌పోవ‌డం, అందులో మంచి ర్యాంకును ద‌క్కించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా హర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర‌స్థానంలో మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ రూపొందించిన తాజా జాబితాలో నాలుగు ప్రముఖ భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చుకున్నాయి. వాటిలో మ‌న హైదరాబాదీ బిర్యానీ అగ్రస్థానంలో ఉండ‌టంతో ఈ డిష్‌కు మ‌రింత విశేష‌ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. TasteAtlas జాబితాలో భారతీయ వంటకాలు ముర్గ్ మఖనీ (ర్యాంక్ 29): దీనిని బటర్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారత సంప్రదాయ వంటకం. మృదువైన చికెన్ ముక్కలు, క్రీమీ టమాటో గ్రేవీతో రూపొందించే ఈ డిష్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొంద...
Soundale Village | తిట్టు తిట్టుకూ 500.. జ‌రిమానా విధిస్తున్న గ్రామ‌ పంచాయ‌తీ
Trending

Soundale Village | తిట్టు తిట్టుకూ 500.. జ‌రిమానా విధిస్తున్న గ్రామ‌ పంచాయ‌తీ

Soundale village : కొంద‌రికి ఓ దుర‌ల‌వాటు ఉంటుంది. చీటికిమాటికి ఎవరిని ప‌డితే వారిని తిట్టేస్తంటారు. విష‌యం చిన్న‌దైనా నోరు పారేసుకుంటారు. ఏది మాట్లాడినా తిట్లను ఊత ప‌దంలా వాడుతుంటారు. నోరు తెరిస్తే అమ్మ‌నా బూతులే (Foul Language). ఎంతో ఈజీగా ఒక‌రి త‌ల్లిని, సోద‌రిని ఉద్దేశించి దూర్భాష‌లాట‌డమే వీరి ప‌ని. ఎవ‌రి మీదైతే కోపం ఉంటుందో వారినే కాకుండా 'నీ అమ్మ‌....,' 'నీ అక్క‌..' అంటూ వారి కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి కూడా ప‌రుష ప‌ద‌జాలాన్ని వాడుతుంటారు. ఇలాంటి వారు స‌మాజంలో మ‌న చుట్టూ అనేక మందే ఉంటారు. అయితే.. ఎవ‌రెలా ఉన్నా త‌మ ఊరులో మాత్రం ఇలాంటి మ‌న‌స్త‌త్వం గ‌ల మ‌నుషులు ఉండొద్ద‌ని భావించారు మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా సౌందాలకు చెందిన ప‌లువురు గ్రామ‌స్థులు. అక్క‌డి జ‌నంలో మార్పును తీసుకురావడానికి ఓ వినూత్న కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. ఒక‌రి త‌ల్లిని, సోద‌రిని ఉద్దేశించి ఎవ‌రైనా తిడితే...
error: Content is protected !!