Soundale Village | తిట్టు తిట్టుకూ 500.. జరిమానా విధిస్తున్న గ్రామ పంచాయతీ
Soundale village : కొందరికి ఓ దురలవాటు ఉంటుంది. చీటికిమాటికి ఎవరిని పడితే వారిని తిట్టేస్తంటారు. విషయం చిన్నదైనా నోరు పారేసుకుంటారు. ఏది మాట్లాడినా తిట్లను ఊత పదంలా వాడుతుంటారు. నోరు తెరిస్తే అమ్మనా బూతులే (Foul Language). ఎంతో ఈజీగా ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి దూర్భాషలాటడమే వీరి పని. ఎవరి మీదైతే కోపం ఉంటుందో వారినే కాకుండా 'నీ అమ్మ....,' 'నీ అక్క..' అంటూ వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా పరుష పదజాలాన్ని వాడుతుంటారు. ఇలాంటి వారు సమాజంలో మన చుట్టూ అనేక మందే ఉంటారు. అయితే.. ఎవరెలా ఉన్నా తమ ఊరులో మాత్రం ఇలాంటి మనస్తత్వం గల మనుషులు ఉండొద్దని భావించారు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సౌందాలకు చెందిన పలువురు గ్రామస్థులు. అక్కడి జనంలో మార్పును తీసుకురావడానికి ఓ వినూత్న కార్యాచరణకు పూనుకున్నారు. ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి ఎవరైనా తిడితే...