దాహమని తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident
Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్కడ పనిచేసే అటెండర్ మూత్రం కలిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వల్ల సచిన్ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు.
కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వస్థతకు గురైనట్లు అనిపించింది. వెంటనే ఆ నీరు ...