Chaava Box office Records : విక్కీ కౌశల్ (Vicky kaushal) ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో స్త్రీ -2 ఫేమ్ దినేష్ విజాన్ ప్రొడ్యూసర్ గా వచ్చిన మూవీ ఛావా. రష్మిక మందన్నా (rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న వర ల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ మూవీ చేస్తున్న ప్రభంజనాన్ని చూసి మరికొన్ని థియేటర్లను పెంచుతున్నారు.విడుదలైన కొన్ని కొత్త సినిమాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం కూడా ఛావా(chava) మూవీకి కలిసొచ్చింది. ఆ సినిమాలను తీసేసి మరి ఈ మూవీని ప్రదర్శిస్తున్నారంటే బాక్సాఫీసు వద్ద ఛావా చేస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు.
Chaava Box office Collections : తొలి రోజు నుంచి కన్సిస్టెన్సి గా వసూళ్లు
విడుదలైన తొలి రోజు నుంచే కన్సీస్టెన్సి గా వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో దాదాపు 33 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రోజు రోజుకు మూవీపై ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా రెండు మూడు రోజుల్లో 500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఖాన్ల త్రయం తర్వాత ఎవరు..?
బాలీవుడ్ లో ఖాన్ల త్రయందే హవా. వారి తర్వాత బాలీవుడ్ ను ఏలేది ఎవరన్న ప్రశ్నకు సమాధానం విక్కీ కౌశల్ కూడా ఒకడు అని చెప్పొచ్చు. ఈ మూవీకి ముందు యురి, సర్దార్ ఉద్దమ్, శ్యామ్ బహద్దూర్ లాంటి హిట్స్ తన ఖాతాలో ఉన్న టాప్ హీరో అనిపించుకోలేకపోయాడు. కానీ ఛావాతో ఒక్కసారిగా విక్కీ కౌశల్ రేంజ్ మారిపోయింది. ఈ మూవీ రాబడుతున్న వసూళ్లను బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ కు ముందు బాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుసగా ఇతర భాషలో వచ్చిన మూవీ స్ అన్నీ బ్లాక్ బస్టర్ లు కొట్టి వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుంటే ఒకప్పుడు భారీ కలెక్షన్ల కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బాలీవుడ్ మాత్రం కొన్ని రోజులుగా వెనకబడిపోయింది. ఆ మధ్య వచ్చిన స్కై ఫోర్స్ మూవీ డిసెంట్ కలెక్షన్స్ అందుకోగా ఛావా రికార్డ్ లు కొట్టే దిశగా దూసుకెళ్తోంది.
దాదాపు 140 కోట్ల బడ్జెట్..
దాదాపు 140 కోట్లతో మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. తెలుగులో కూడా మూవీని తీసుకురావాలని చాలా మంది తెలుగు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ పై మూవీ టీమ్ స్పందించి తెలుగులోకి కూడా తీసుకువస్థారేమో చూడాలి. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే ఇప్పటికే కలెక్షన్స్ (Chaava Box office) పరంగా అన్ని రికార్డ్ లు బద్దలు కొట్టేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా మూవీలో టాప్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పనిచేశారు. అశుతోష్ రాణా, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించగా ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] అంతలా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఛావా ప్రభంజనానికి అడ్డు లేకుండా పోయింది. […]