Chaava Movie in Telugu | బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఛావా (Chaava) మూవీ తెలుగులో కూడా రాబోతుంది.లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో విక్కీ కౌశల్ (Vicky koushal)ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయింది. రష్మిక మందన్న (rashmika mandanna) హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్త్రీ -2 ను నిర్మించిన దినేష్ విజాన్ నిర్మించారు.
ఊహించని రెస్పాన్స్..
దాదాపు 140 కోట్లతో నిర్మించిన ఈ మూవీని మొదట 5500 ల స్క్రీన్ లలో రిలీజ్ చేయగా ఊహించని రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ అదుర్స్ అనిపించాయి. దాదాపు 32 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు టాక్ తెచ్చుకుంది. ఆరోజు నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ గా కలెక్షన్స్ అదే విధంగా రాబడుతూ చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి ఊపిరి పోసింది.
రిలీజ్ రోజు కంటే తర్వాతి రోజుల్లో కలెక్షన్స్ ఎక్కువ రాబట్టింది. తెలుగులో రిలీజ్ అయిన మూవీస్ అంతలా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఛావా ప్రభంజనానికి అడ్డు లేకుండా పోయింది. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్లు కొల్లగొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పట్లో ఈ కలెక్షన్స్ సునామీ ఆగేలా లేదు. ఎందుకంటే ఈ మూవీ కి పోటీగా ఏ బడా మూవీ రిలీజ్ ఇప్పట్లో లేదు. ఏదైనా రిలీజ్ చేయడానికి ఎవరైనా సన్నాహాలు చేయడానికి వెనకడుగు వేయక తప్పదు. ఇదే రేంజ్ లోమూవీ కలెక్షన్స్ ఎంత లేదన్నా ఇంకా రెండు మూడు వారాలు ఈజీ గా ఉంటుంది. ఒక బాలీవుడ్ లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యపోనక్కలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.
Chaava Movie in Telugu : మార్చి 7న తెలుగులో….
ఇక అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తె ఇండియన్ సినిమా అల్ టైం రికార్డ్ లు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. మూవీని మేకర్స్ ఒక హిందీలో మాత్రమే రిలీజ్ చేసారు. అయినా సరే మూవీని చూడడానికి ఆడియన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ మూవీపై అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రిలీజ్ రోజు నుండే తెలుగు మూవీ లవర్స్ తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని మూవీ మేకర్స్ కి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి తెలుగు ఆడియన్స్ (Chaava Movie in Telugu ) కోసం మూవీ ని తెలుగులో కి కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు ఒక క్లారిటీ కూడా వచ్చింది.గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని మార్చి 7 న రిలీజ్ చేయనున్నట్టు గీతా ఆర్ట్స్ సంస్థ తెలిపింది. శంబా జీ మహారాజ్ జీవితమాధారంగా మూవీని నిర్మించారు. శంబాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ అదరగొట్టగా,ఆయన భార్య ఏసుబాయి క్యారెక్టర్ లో రష్మిక మందన్న మెప్పించారు. మూవీలో ఇంపార్టెంట్ ఔరంగజేబు క్యారెక్టర్ ని అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశారు. తెలుగులో కూడా చావా వస్తుం దని తెలియడంతో తెలుగు మూవీ లవర్స్ సంబరపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








