Indiramma Indlu Beneficiary Status : కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కోసం అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితా రూపొందించండంతోవారు నిమగ్నమయ్యారు. అయితే తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా అనే ఆందోళనలో దరఖాస్తుదారులు ఉన్నారు. వీరి ఆందోళనకు చెక్ పెడుతూ ప్రభుత్వం నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్ కూడా ప్రారంభించింది. నేరుగా ఇందులో దరఖాస్తుదారుడు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ అధికార వెబ్‌సైట్ Indirammaindlu.telangana.gov.in లో చాలా సులభంగా మీ దరఖాస్తు ( Indiramma Indlu Application ) వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ అందుబాటులో ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో ఖాళీ స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ గృహాన్నిమంజూరు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 80 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇంత పెద్ద ఎత్తున అప్లై చేయడంతో వీటిని పరిశీలించి ఫిల్టర్ చేయడానికి చాలా సమయం పట్టింది. మొదట అభయహస్తంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణలో కొన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇది కాకుండా కొంతమంది తాము అర్హులమని తమకు పథకం అమలు కాలేదని ఆందోళన చెందుతున్నారు.
Indiramma Indlu : ఇది నిరంతర ప్రక్రియ
ఇదిలా ఉండగా గ్రామసభల్లో చదివిన జాబితా ఫైనల్ కాదని, అర్హులైన చివరి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెల్లడించారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇక యాప్ లో ఇందిరమ్మ ఇల్ల మంజూరుకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు.
టోల్‌ఫ్రీ నెంబర్
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. అందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దరఖాస్తుదారుడు వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఐఎఫ్ఎస్సి నెంబర్ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, రేషన్ కార్డుల కోసం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








