Sarkar Live

Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు ప‌థ‌కాల పైస‌లు ప‌డేది నేడే..

Raithu Bharosa Scheme | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా(Raithu Bharosa Scheme) , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు

Tummala Nageswara Rao

Raithu Bharosa Scheme | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా(Raithu Bharosa Scheme) , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు మంజూరుకు శ్రీ‌కారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ రోజు (జనవరి 27) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నాలుగు పథకాల ద్వారా రైతులు, కూలీలు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో (Bank Accounts) నేరుగా జమ చేస్తున్నారు.

Raithu Bharosa : అకౌంట్లో డ‌బ్బులు జ‌మ కాక‌పోతే..

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, సంబంధిత అధికారులను పథకాల అమలుకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త‌మ అకౌంట్లలో నగదు జమ కాకపోతే స్థానిక అధికారులను సంప్రదించాల‌ని ల‌బ్ధిదారుల‌కు సూచించింది.

రైతు భ‌రోసా ఎంత అంటే…

రైతుల సంక్షేమం కోసం రూపొందించిన రైతు భరోసా (Raithu Bharosa) పథకం కింద‌ ఎకరాకు రూ. 6 వేల నగదు జమ చేయ‌నున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ నిధులను ప్రభుత్వం అందజేస్తోంది. మొదటి దశలో 70 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో మొదటి దశలో ఈ పథకం అమలు అమ‌లవుతోంది. మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,000 గ్రామాల్లో సాచురేషన్ పద్ధతిలో రైతులకు భరోసా అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు..

రైతు కూలీలు, పేద ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా (Indiramma Atmiya Bharosa) ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చింది. దీని కింద రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. మొదటి విడతలో దాదాపు 10 లక్షల మందికి ల‌బ్ధి చేకూర‌నుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు నెలకు రూ. 1,000 చొప్పున నగదు అందించడమే కాకుండా వారి కుటుంబాల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

ఇందిరమ్మ ఇళ్లు పథకం

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) పథకం కింద పేద కుటుంబాలకు ఉచిత గృహాలను నిర్మించి అందించడం ప్రభుత్వ లక్ష్యం. సకాలంలో ఈ పథకం అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందించడానికి తగిన చర్యలు చేపట్టినట్లు స‌ర్కారు వెల్లడించింది.

కొత్త రేషన్ కార్డుల జారీ

పేద, మధ్య తరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. మార్చి 31 నాటికి ఈ పథకం ద్వారా అర్హుల‌కు రేషన్ కార్డు అందేలా చూడనున్నారు. ఈ పథకం కింద అనర్హులకు కార్డులు జారీ చేయకుండా కఠిన నియంత్రణలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అన‌ర్హులైతే వేటు త‌ప్ప‌దు

ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక ప్రకారం అన‌ర్హులు లబ్ధి పొందితే ఆ పథకాలను నిలిపివేస్తామని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేష‌న్ కార్డుల‌కు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం క‌ల్పించింది. ఎవరైనా కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే స్థానిక అధికారులను సంప్రదించి వివరాలు సమర్పించొచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?