Chinese Manja హైదరాబాద్ : సంక్రాంతి సమీపిస్తుండడంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలు కొడుతుంటారు. పట్టాణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా ఆకాశంలో రంగురంగుల పతంగులు కనువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగిస్తుండడంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన కలిగించాయి. చైనా మాంజాపై ప్రభుత్వం ఎప్పటినుంచో నిషేధం విధించినప్పటికీ కొందరు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు.
Chinese Manja seized : అయితే పిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేసిన 1,094 బాబిన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. చైనీస్ మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేశారు. చైనీస్ మాంజాతో ఎవరైనా గాయపడితే గాలిపటాలు అమ్మేవారిని నేరుగా బాధ్యులను చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చైనా మాంజా ఎవరూ ఉపయోగించొద్దు.
“ఫీల్డ్ ఆఫీసర్లందరూ చైనీస్ మాంజా అమ్ముతున్న గాలిపటాల అమ్మకందారులపై కేసులు బుక్ చేశారు. మేము స్థానిక నివాసితులతో అవగాహన సమావేశాన్ని కూడా నిర్వహించాం. చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించామని సౌత్-వెస్ట్ జోన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) చైనీస్ మాంజాను ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, విక్రయించడంపై పూర్తి నిషేధం విధించింది, ఎందుకంటే ఇది పక్షులు, మానవులకు ముప్పు కలిగించడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..