మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi ) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమై సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ వీడియో ఆడియన్స్ ని ఆకర్షించింది.అనిల్ రావిపూడి మూవీ అంటేనే ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తాడు. మూవీ మొదలుకాకముందే సరికొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్ లను, రైటర్లను, పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో సినీ లవర్స్ మెప్పించింది.
ఇక మూవీ సెట్స్ మీదకి వెళ్లాక ఎన్నో సర్ప్రైజ్ లను చూపెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది.ఇప్పటికే ఒక క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో విక్టరీ వెంకటేష్ (victory venkatesh)అతిధి పాత్రలో మెరుస్తారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దీనిపై మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విక్టరీ వెంకటేష్ కి మెగాస్టార్ కి మధ్య ఎంతో చనువు ఉంది.
అతిథి పాత్రలో వెంకీ..?
ఆ మధ్య వెంకీ 75 ఫంక్షన్ లో కూడా వెంకీ తో ఓ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు చిరు. ఇక అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది . ఈ ఇద్దరితో మంచి ర్యాపో ఉన్న వెంకీ ఈ మూవీలో యాక్ట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ మూవీ కూడా వింటేజ్ చిరుని గుర్తు చేసేలా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ డాన్స్ఎంత బాగా చేస్తాడో కామెడీని కూడా అంతే బాగా చేస్తాడు. ఆయన కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటిది కామెడీలతోనే ఇండస్ట్రీ హిట్లు కొట్టే అనిల్ డైరెక్షన్ లో మూవీ అంటే బాక్సాఫీస్ షేక్ కాకుండా ఉంటుందా. పూర్తిగా హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ మూవీపై రోజుకో వార్త వినపడుతూనే ఉంది.
నక్క తోక తొక్కిన కార్తికేయ..?
ఇదిలా ఉండగానే ఇందులో విలన్ గా మెగాస్టార్ అభిమాని అయిన కార్తికేయ (Karthikeya)నటించబోతున్నట్లు ఫిలింనగర్ లో లేటెస్ట్ గా టాక్ వినబడుతుంది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోగా పరిచయమైన కార్తికేయ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన మూవీల లో కూడా ఆడియన్స్ ను మెప్పించాడు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం తనకు మంచి ఆపర్చునిటీ,అందులో మెగాస్టార్ (Chiranjeevi) తో సినిమా అంటే కార్తికేయ కాదంటాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్తికేయ ఈ మూవీని వదులుకోడు. దీనిపై మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఫిలింనగర్ లో మాత్రం జోరుగా టాక్ వినబడుతోంది.ఇదే నిజమైతే కార్తికేయ నక్క తోక తొక్కినట్టే అని మెగాస్టార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఏదేమైనా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో మళ్ళీ వింటేజ్ చిరుని చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.